లక్ష్మా తండా  గ్రామపంచాయతీలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన

  • ముఖ్యఅతిథిగా  హాజరైన   మాజీ ఎమ్మెల్యే  భానోత్ శంకర్ నాయక్ .

.విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా: లక్ష్మ తండా గ్రామపంచాయతీలో  ( పర్వతగిరి గ్రామం )  గత మూడు రోజుల నుండి అనగా 7, 8,9 వ తేదీలలో  హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కొరకై లక్ష్మతండా   గ్రామపంచాయతీ లోని  ప్రజలు  చాలా భక్తి శ్రద్ధలతో మూడు రోజులపాటు లక్ష్మ తండా గ్రామపంచాయతీ సర్పంచ్  గూగులోతు  ఈశ్వరి రవి నాయక్ , గ్రామపంచాయతీలోని ప్రజలు, భక్తుల , ముగ్గురు పురోహితుల  ఆధ్వర్యంలో  భారీ సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు భానోత్ శంకర్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా శంకర్ నాయక్, మాట్లాడుతూ మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ముందు లక్ష్మ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోతు ఈశ్వరి రవి నాయక్ గ్రామపంచాయతీ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీనీ  ఈ గ్రామస్తులకు తన సొంత పైసలతో హనుమాన్ విగ్రహాన్ని ఇప్పిస్తానని  ఇచ్చిన హామీని నెరవేర్చారు అని గుర్తు చేశారు. మరియు విగ్రహ ప్రతిష్టాపన కొరకు వచ్చిన పూజారులు , ( పురోహితులు) , గ్రామస్తుల భక్తులు, సర్పంచ్ ఈశ్వరి రవి నాయక్ మాట్లాడుతూ హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం ,  గ్రామస్తులకు చాలా సంతోషకరమైన విషయమని, చాలా గొప్ప విషయమని ,  వారు అన్నారు . అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కొరకు గ్రామస్తులు, భూఖ్య బుజ్జి దల్ సింగ్, ఒక గుంట భూమి , బానోతు లక్ష్మణ్ నాయక్ అరగంట భూమిని దాతగా ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో గ్రామ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

🕒 10 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/installation-of-hanuman-idol-in-lakshma-tanda-village-panchayat/article-15228

Tags: