ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి.
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా:- ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అన్ని జిల్లాలలో వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్నూమరేషన్ కు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో పది లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వీరంతా స్వీయ గణన చేసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్ మొదటి అంతస్తు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచనలు ఆదేశాల మేరకు సంబంధిత అంశాలపై పకడ్బందీగా ముందుకెళ్తామన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యా వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. సెన్సెస్ పై సూపర్వైజర్లు, ఎన్నుమరేటర్లకు గూగుల్ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, వ్యవసాయ శాఖ అధికారిని సరిత, విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, ఇంటర్మీడియట్ అధికారి మదర్, ఈ ఈ అరుణ్ కుమార్, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి చరణ్, మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, సిపిఓ శ్రీనివాసరావు,డి.ఎస్ఓ రమేష్, డి ఎం సప్లై సివిల్ సప్లై నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.