ప్రతి ఒక్కరూ స్వీయ గణన కార్యక్రమంలో పాల్గొనాలి

  • క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం,
    నూతన మెడికల్ కాలేజ్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి
    పంట మార్పిడి విధానం, సేంద్రియ ఎరువుల వాడకం నేచురల్ వ్యవసాయంపై రైతులు ముందుకు రావాలి
  • జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

విశ్వంభర, మహబూబాబాద్:  స్వీయ గణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని వారి  వివరాలను నమోదు చేసుకోవాలని, తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించినట్లు అవుతుందని జనాభా గణన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని  ఐడిని పొందాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే అన్ని విభాగాలలో ప్రభుత్వ ప్రైవేటు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ తదితర ఉద్యోగస్తులు తమ వివరాలను నమోదు చేసుకున్నారని, మరింత విస్తృత ప్రచారం కల్పించడం కోసం ఈరోజు స్వీయ జనన ప్రచార రథం ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఆడియో, వీడియో, వివిధ సామాజిక మాధ్యమాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ జన గణన పై విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.  బ్యాంకింగ్ రంగ వ్యవస్థ సామాజిక బాధ్యతగా రైతులకు అండగా ఉండేందుకు కృషి చేయాలని అందులో భాగంగానే  గూడూరు మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పరికరాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తుందని ప్రతి ఒక్క రైతు వారి హక్కుగా భావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే పథకాన్ని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం పంట మార్పిడి విధానం, అంతర్ పంటలు పామ్ ఆయిల్, కూరగాయలు, తదితర వాణిజ్య, మిల్లెట్స్,పంటలు ద్వారా రైతులు అధిక లాభాలు పొందుతున్నారని ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి పంటలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు, సేంద్రియ ఎరువుల వాడకం, నేచురల్ వ్యవసాయం, తెలియపరచాలని, అధికంగా యూరియా వాడకం వలన భూసారం దెబ్బతింటుందన్నారు, నానో యూరియా పై రైతులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం రవీంద్రబాబు, కమలాకర్, ఏ.రవి, రమేష్, విజయ్ కుమార్, గూడూరు సర్పంచ్ సునీత కుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్ పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఇప్పటికే దాదాపుగా పూర్తి అయిన భవనం యొక్క పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి సిద్ధం చేయాలని తెలిపారు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, తదితర పనులు పూర్తి కావడంతో మిగిలిన చిన్న చిన్న వర్కులను తక్షణమే పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో కలెక్టర్ వెంట సిపిఓ శ్రీనివాసరావు, డి పి ఆర్ ఓ రాజేంద్రప్రసాద్, వెటర్నరీ జిల్లా అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారిని సరిత, ఉద్యాన వన శాఖ అధికారి జి. మరియన్న, ఏ డి ఏ శ్రీనివాసరావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్ లకావత్, ఆర్ అండ్ బి ఈ ఈ, తదితరులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/everyone-should-participate-in-the-self-enumeration-program/article-15151

Tags: