ఇద్దరు పిల్లలను వదిలి అదృశ్యమైన మహిళ

ఇద్దరు పిల్లలను వదిలి అదృశ్యమైన మహిళ

  • . అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు?

విశ్వంభర, మహాదేవపూర్:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామానికి చెందిన నార రవికాంత్ (31) భార్య మాధురి అదృశ్యమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, దంపతులకు పదేళ్ల క్రితం వివాహం కాగా, ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానంగా ఉన్నారు. తేదీ 08-05-2026 రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో భోజనం చేసి నిద్రించగా, అర్ధరాత్రి సమయంలో మాధురి కనిపించకపోవడంతో భర్త రవికాంత్ ఆందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మహాదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, మాధురి అదృశ్యంపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత పరిచయాల నేపథ్యంలో వెళ్లి ఉండొచ్చన్న కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. మహిళ ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

🕒 10 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-woman-who-disappeared-leaving-behind-two-children/article-15234

Tags: