వీడియో కాన్ఫరెన్స్ లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ , ఉన్నతాధికారులు 

  • ధాన్యం కొనుగోలు పై సీఎస్ రామ కృష్ణా రావు  వీడియో కాన్ఫరెన్స్  

విశ్వంభర,సూర్యాపేట: ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా, డిఆర్డీఓ తదితర అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అన్ని జిల్లాలలో వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో పది లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వీరంతా స్వీయ గణన చేసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సిఎస్ అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పౌర సరఫరాలు, విద్యా, డిఆర్డీఓ తదితర  అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ  ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యా వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. సెన్సెస్ పై సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణా సమావేశాలు  నిర్వహించి సన్నద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరి సింగ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డిఆర్డిఓ సన్యాసయ, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం సివిల్ సప్లై శ్రీధర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, జిల్లా సహకార అధికారి ప్రవీణ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి,  జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

🕒 10 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/suryapet-district-collector-and-higher-officials-in-the-video-conference/article-15224

Tags: