విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే  భూపతి రెడ్డి

- ఆలయంలో ప్రత్యేక పూజలు 

విశ్వంభర, నిజామాబాద్ :-ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పద్మావతి గోదాసమేత  వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహం ప్రతిష్ఠాపన మహోత్సవంలో శనివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికారు.ఈ మేరకు ఎమ్మెల్యే .భూపతి రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ.. ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల పై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి గ్రామాభివృద్ధికి తనవంతుగా సహాయసహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. ధర్పల్లి మున్నూరుకాపు కల్యాణ మండపంలో వివాహానికి హాజరైన ఎమ్మెల్యే అంతకు ముందు ధర్పల్లి మున్నూరుకాపు కల్యాణ మండపంలో జిన్నా లచ్చారెడ్డి కుమారుడి వివాహానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ధర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ బాల్ రాజు, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, రాంచందర్ గౌడ్,ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🕒 10 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-bhupathi-reddy-at-the-statue-inauguration-ceremony/article-15220

Tags: