సీఎం సభను జయప్రదం చేద్దాం : కే ఎల్ ఆర్
- పాలన భవనం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, కే ఎల్ ఆర్
విశ్వంభర, మహేశ్వరం : కందుకూరు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి మణిహారంగా నిలిచే భారత్ ఫ్యూచర్ సిటీ కి ప్రజలంతా తరలిరావాలని మంత్రి శ్రీధర్ బాబు సహా కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పిలుపునిచ్చారు. ఫ్యూచర్ సిటిలో ఈ నెల 10న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సీఎం రాక సందర్భంగా మరోసారి ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీధర్ బాబు, లక్ష్మారెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు.ఫ్యూచర్ సిటి డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవాలను కనుల పండుగగా జరుపుకునేందుకు జనం, కాంగ్రెస్ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ఉద్యోగ ఉపాధి ఇచ్చే స్కిల్ యూనివర్సిటీ పాలన సౌలభ్యం కోసం నిర్మించిన ఫ్యూచర్ సిటి డెవలప్మెంట్ అథారిటీ భవనాలు అందుబాటులోకి రావటం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు కేఎల్ఆర్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్ద ఎత్తున గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలిరావాలని మరోసారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.