కీసర సెరినిటి పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 

విశ్వంభర, కీసర: మండలంలోని కీసర సెరినిటి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు యోగా యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణలో దాని పాత్ర గురించి పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ జోనో వివరించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం పాఠశాల పీ.ఈ.టి. ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ యోగా ఆసనాలను అభ్యసించి తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా పట్ల తమ ఆసక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ జోనో, ప్రిన్సిపాల్ మధుసూదన్, అడ్మినిస్ట్రేటర్ సునీల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించిందని నిర్వాహకులు తెలిపారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/international-yoga-day-was-celebrated-at-keesara-serenity-school/article-16835

Tags: