ఉద్యమకారుల డిమాండ్లు 100 రోజుల్లో పరిష్కరించాలి

విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం 679 జీఓ ద్వారా ఏర్పాటు చేసిన కేకే కమిటీ కాలయాపన కమిటీగా మారకూడదు. కొద్దిమందికి తాయిలాలు ఇచ్చి సమస్యలను ముగించాలనే ప్రయత్నాలను ఉద్యమకారులు ఒప్పుకోమని  తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి తెలిపారు. గురువారం హైదరాబాదు సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యమకారుల డిమాండ్లను 100 రోజుల్లో పరిష్కరించకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఉద్యమకారుల కమిటీలో ఉద్యమ సంఘాలు, మహిళా, విద్యార్థి నాయకులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 25 వేల పెన్షన్, 100 ఎకరాల్లో అమరుల స్మృతి వనం, 50 లక్షల ప్రమాద బీమా, ఒక కోటి రుణం, గుర్తింపు కార్డులు 100 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీవీ రమణ, శామ్యూల్, గంగరాజు, వి. అరుణ పాల్గొన్నారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-demands-of-the-activists-should-be-resolved-within-100/article-16229

Tags: