ఉద్యమకారుల కోసం మరో పోరాటం: సుల్తాన్ యాదగిరి

విశ్వంభర, సికింద్రాబాదు : తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే మరో పోరాటం తప్పదని టియుజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి హెచ్చరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాదు క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద టియుజేఏసీ ఆధ్వర్యంలో నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేలాది అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, నెలకు 25 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్ఫూర్తిని నిలబెట్టేందుకు 100 ఎకరాల్లో స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టియుజేఏసీ రాష్ట్ర నాయకులు బోయ వెంకటరమణ, సాంబశివరావు, గందమాల యాదగిరి, సామ్యూల్, వేణుగోపాల్, గడ్డం నర్సింగ్, ఎస్ రాజయ్య, ఎల్ స్వరూప, వి అరుణ, పి కమల, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/another-struggle-for-the-activists-was-sultan-yadagiri/article-16170

Tags: