గ్రామ సభలను విజయవంతం చేయాలి
- ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై రైతులకు అవగాహన కల్పించాలి
- నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ నిఘా పెంచాలి
: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: వచ్చే నాలుగు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభల కోసం మండలాల వారీగా ఎంపిడిఓలు, తహసీల్దార్లు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి గ్రామ సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. జిల్లాలో నిర్వహించే గ్రామ సభలు, శానిటేషన్, తాగునీరు, సీజనల్ వ్యాధుల నివారణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సవరణలపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉన్న అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బందితో పాటు, మండల స్థాయి అధికారులు కూడా ఖచ్చితంగా గ్రామ సభల్లో పాల్గొనేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు వేదికల్లో నిర్వహించాలని, గ్రామ సభలు అధికారులందరూ హాజరు కావాలని సూచించారు. రైతులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వివరించాలని తెలిపారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ ప్రక్రియపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 72శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాను 3వ స్థానంలో నిలిపినందుకు వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా జిల్లాలో యూరియా విక్రయాలు ఎక్కువగా ఉండటంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు యూరియాను ఎందుకు అంత ఎక్కువగా వినియోగిస్తున్నారనే అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఆలోచన చేయాలన్నారు. అలాగే, వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ బృందాలు గట్టి నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. అదే విధంగా రానున్న వర్షాకాలం పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒకవేళ వర్షపాతం తక్కువగా నమోదైతే ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం నిర్వహించబోయే వన మహోత్సవం కార్యక్రమం కోసం అటవీ శాఖ, డీఆర్డీఏ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లో డ్రైనేజీల క్లీనింగ్, పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలి. వారం రోజుల్లోగా సమగ్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో కలుషిత నీటి సమస్య రాకుండా, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల న్నారు. ప్రజాపాలన కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను అధికారులు సబ్మిట్ చేస్తే వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అలాగే, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) పై అధికారులందరికీ పూర్తి అవగాహన ఉండాలని, ఇందుకోసం సిబ్బందికి తక్షణమే ఒకరోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లా ప్రగతిలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
గ్రామ సభల విజయవంతానికి పోలీస్ శాఖ పూర్తి సహకారం: జిల్లా ఎస్పీ నరసింహ
జిల్లాలో నిర్వహించబోయే గ్రామ సభలు, వార్డు సభలను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పోలీస్ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించే అన్ని ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సభల పర్యవేక్షణ, బందోబస్తు నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ అధికారిని (స్పెషల్ ఆఫీసర్) నియమిస్తున్నట్లు చెప్పారు. అలాగే, మున్సిపాలిటీలలో నిర్వహించే వార్డు స్థాయి సభలలో కూడా పోలీస్ సిబ్బంది ఖచ్చితంగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గ్రామ సభలను వేదికగా చేసుకుని శాంతిభద్రతలతో పాటు పలు కీలక సామాజిక అంశాలపై ప్రజలకు పోలీస్ శాఖ తరపున అవగాహన కల్పించనున్నట్లు ఎస్పీ వివరించారు. ముఖ్యంగా స్త్రీ, శిశు సంరక్షణ, మహిళలు, బాలల భద్రత, చట్టాలపై అవగాహన, యాంటీ డ్రగ్స్, అలైవ్ అరైవ్ నివారణపై అవగాహన కల్పిస్తామన్నారు. రైతులను ముంచే నకిలీ విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తోందని ఎస్పీ నరసింహ తెలిపారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు నుంచే విద్యార్థులకు, యువతకు యాంటీ డ్రగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా పక్కా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్డిఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈవో శిరీష, డిఎఫ్ఓ దామోదర్ రెడ్డి, డిపిఓ యాదగిరి, డిఏఓ శ్రీధర్ రెడ్డి, సిపిఓ కిషన్, జిల్లా ఫైర్ అధికారి కృష్ణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.