వృద్ధ తల్లిదండ్రుల ఆలనా- పాలన చూడడం బిడ్డల బాధ్యత

  •  గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
  •  నిరుపేదలను ఆదుకోవడంలో డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆదర్శం 
  • 30వ నెల నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన గాంధీజీ ఫౌండేషన్ 

విశ్వంభర, చండూర్ : ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో చండూరు మున్సిపాలిటీ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు 2024 జనవరి ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్  "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం సోమవారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి జన్మదినమును పురస్కరించుకొని 30 వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ  కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, చండూరు మాజీ సర్పంచులు కోడి గిరిబాబు, కలిమికొండ జనార్ధన్, డిసిఇబి మాజీ డైరెక్టర్ కోడి సుష్మ వెంకన్నహాజరై మాట్లాడుతూ సమాజంలో పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరికి సహాయం చేయాలని ఒక స్పష్టతతో 30 మంది సరియైన పేదలను ఎంపిక చేసుకొని వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. సమాజంలో చాలామందికి డబ్బులు ఉంటాయని, దానం చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుందని, ఏదో ఒక నెల కాకుండా 30 నెలల నుండి ప్రతి నెల ఒకటవ తేదీన 30 మందికి నిత్యవసర సరుకులు పంచడం అభినందనీయమని అన్నారు. పనిచేయడానికి శక్తి లేకుండా కుమారులు, కూతుళ్లు లేని ఒంటరి మహిళలే ఎక్కువగా ఉన్నారని, వృద్ధ తల్లిదండ్రుల ఆలనా పాలన చూడడం బిడ్డల బాధ్యత అని గుర్తు చేశారు.  చిన్నతనంలో తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా చూశారో, అదే విధంగా మన తల్లిదండ్రులు వృద్ధులు అయ్యాక మనం చూడాలని తెలిపారు. గాంధీజీ ఫౌండేషన్  చైర్మన్  డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మా ఫౌండేషన్ 30 నెలలుగా  12 లక్షల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద  విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను, చనిపోయిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని చేస్తూ వస్తుందని తెలిపారు. వేసవికాలంలో చండూరు మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, లక్ష్మీ గార్లను ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బుషిపాక వాసు,జెల్ల ధనమ్మ శ్రీనివాసులు, కటకం రమేష్, కో ఆప్షన్ సభ్యులు కలెట్ల చంద్రకళ మారయ్య, ఖలీల్ , మొగుదాల వెంకన్న, షరీఫ్ , భీమనపల్లి శేఖర్, పన్నాల లింగయ్య, పున్న ధర్మేందర్, గజ్జల కృష్ణారెడ్డి, పందుల సత్యనారాయణ, జూలూరు వెంకటేశం,మాస కృష్ణ, ఈదులకంటి లింగస్వామి,  మొగుదాల  శేఖర్, కిరణ్, దశరథ,నల్ల సత్యనారాయణ, ఆంజనేయులు, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న,  బుషిపాక యాదగిరి, బోడ విజయ్, బోడ సాయి, గోపి తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/it-is-the-responsibility-of-the-children-to-look-after/article-16178

Tags: