అభివృద్ధి, ఓటర్ నమోదు పై అవగాహన

అభివృద్ధి, ఓటర్ నమోదు పై అవగాహన

విశ్వంభర, షాబాద్: ప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా షాబాద్ మండలంలోని గ్రామంలో ప్రత్యేక గ్రామసభను గ్రామ సర్పంచ్ నవనీత స్వామి ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ గ్రామసభకు ముఖ్య అతిథిగా షాబాద్ మండల ఎమ్మార్వో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అభినందించారు. అలాగే ఓటర్ మ్యాపింగ్, ఎస్‌ఐఆర్  ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం రైతులందరూ రైతు గుర్తింపు కార్డుల కోసం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ ఏఈఓ మాట్లాడుతూ, రైతు గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియతో పాటు వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అనుకూల పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. వైద్య శాఖ తరఫున డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 15 సంవత్సరాలు నిండిన బాలికలు హెచ్‌పీవీ  వ్యాక్సిన్‌ను తీసుకొని ఆరోగ్య రక్షణ పొందాలని వివరించారు. అలాగే గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పిస్తూ తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ప్రత్యేక డబ్బాల్లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింహారావు, వార్డు సభ్యులు శ్రీహరి, శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్, మహేష్, రాఘవాచారి, గీత, యాదయ్య, అనురాధ, గ్రామ కమిటీ అధ్యక్షుడు కిష్టయ్య, గ్రామ పెద్దలు నరహరి, బాల్‌రెడ్డి, గోపాల్, సుధాకర్ రెడ్డి, సత్తయ్య, శ్రీకాంత్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/awareness-on-improving-voter-registration/article-16231

Tags: