శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు

విశ్వంభర, హుస్నాబాద్ : శాతవాహన యూనివర్సిటీ 86వ పాలకమండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సమావేశం తెలంగాణ ప్రభుత్వ సచివాలయంలోని సమావేశ మందిరంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రానా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి, శాతవాహన యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు  బొలిశెట్టి రజిత పాల్గొని యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ యూనివర్సిటీ ప్రగతి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతుల విస్తరణ, విద్యా ప్రమాణాల పెంపు తదితర అంశాలపై పాలకమండలి ముందు సమగ్ర నివేదికను సమర్పించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన వివిధ పనులకు నిధుల కేటాయింపుతో పాటు పలు కీలక నిర్ణయాలను పాలకమండలి ఆమోదించినట్లు హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి తెలిపారు. ఈ నిర్ణయాలు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/key-decisions-for-the-development-of-satavahana-university/article-16222

Tags: