తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
విశ్వంభర, హుస్నాబాద్ : తెలంగాణ ఏర్పాటుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఉపయోగపడితే, దాన్ని అమలు చేసి యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, మిత్రపక్షాలు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను, ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ ను ఏర్పాటు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మంత్రి ఎగరవేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్న అందరూ కలిసి తెలంగాణ ప్రజల సార్వతోముఖభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారులకు, అమరులకు నివాళులర్పిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యమకారులందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.