బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుక

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుక

విశ్వంభర, నెల్లికుదురు: నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు బొల్లు మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మురళీకృష్ణ యాదవ్ పార్టీ జెండా  ఆవిష్కరించారు. దీనికి ముఖ్యఅతిథిగా ఆ గ్రామ సర్పంచి చిర్ర యాకాంతం గౌడ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రథసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు. రైతుబంధు, వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు బీమా వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి కాలేశ్వరం ప్రాజెక్టు తో సాగునీరు అందించిన ఘనత కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నారు.కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు యువకులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-inauguration-ceremony-under-the-auspices-of-brs/article-16174

Tags: