పేదలకు ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం
- ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్
విశ్వంభర, ఇనుగుర్తి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదలకు సొంత ఇల్లు నిర్మాణం సాధ్యమవుతుందని ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగరంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మాణం పూర్తయిన 21 మంది లబ్ధిదారులు మంగళవారం చేసిన గృహప్రవేశాలకు ఎంపీ ఎమ్మెల్యే లతోపాటు తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు,ఎంపీడీవో బండారు పార్థసారథి,మానుకోట మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్,స్థానిక సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పార్టీ నాయకులు హాజరై గృహప్రవేశాల క్రతవులో పాల్గొన్నారు. అనంతరం సర్పంచి సుజాత యాకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తినాలని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తుందన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు,గృహ జ్యోతి కింద ఉచిత కరెంట్, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు వంటి ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతూనే ప్రభుత్వం అభివృద్ధి నీ పరుగులు పెట్టిస్తోందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పేదలకు ఇండ్లు ఇవ్వాలని, అన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు తదితర పథకాలు ఇవ్వాలనే సోయి లేదన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను ఓర్వలేక లేనిపోని అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. రెండవ విడత ఇండ్లు సైతం అర్హులకు మంజూరు చేస్తామని ఎవరు నిరాశ పడవద్దు అని విడతలవారీగా అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సోనీ, ఆర్ ఐ బషీర్, స్థానిక ఉపసర్పంచి సతీష్ చారి, దిశ సభ్యులు గుజ్జునూరి బాబురావు, ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా,బ్లాక్,మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.