సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

విశ్వంభర, హుస్నాబాద్:  తెలంగాణ రాష్ట్ర  ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్‌లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో సీపీఐ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామసభల ద్వారా అర్హులైన పేదలకు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సంక్షేమ పథకాల అమలు జరగాలని అన్నారు. నిత్యావసర వస్తువులపై కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని, వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ఉద్యమకారులు పోలీసు కేసులు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ తగిన గుర్తింపు లభించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులకు ఇంటి స్థలం, పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాకపోవడం బాధాకరమన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమకారులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో సిపిఐ నాయకులు గూడ పద్మ, జనగాం రాజ్‌కుమార్, రోళ్ల భాగ్య, ఎండి అంకుశావలి, ఎనగందుల లక్ష్మీనారాయణ, పిట్టల మొగిలయ్య, బింగి సమ్మయ్య, అయిలేని మల్లారెడ్డి, గుంటిపెల్లి లక్ష్మి, చొక్కం ఎల్లవ్వ, దొంతరబోయిన రాజవ్వ, పెద్ది నిర్మల, దొంతరబోయిన రజిత తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telangana-emergence-day-under-the-auspices-of-cpi/article-16204

Tags: