గుర్తుతెలవని  మహిళ మృతదేహం లభ్యం

గుర్తుతెలవని  మహిళ మృతదేహం లభ్యం

విశ్వంభర, త్రిపురారం:  త్రిపురారం శివారులో  వ్యవసాయ పొలంలోని  బావిలో ఒక గుర్తు తెలియని మహిళ  మృతదేహం లభ్యమైంది.   త్రిపురారం  ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం  ఉదయం  09:00 గంటలకు త్రిపురారం గ్రామ శివారులోని అనుముల విక్రం రెడ్డి వ్యవసాయ పొలంలోని బావిలో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు పసుపు రంగు లంగా, ఆకుపచ్చ జాకెట్ ధరించి ఉండగా, కాళ్లకు పట్టీలు, మెట్టెలు ఉన్నవి. ఆమె మెడకు చీర బిగించి ఉండటం, చేతులు ఎరుపు రంగు స్కార్ఫ్‌తో వెనుకకు కట్టబడి ఉన్నాయి. బావి సమీపంలో ఒక జత చెప్పులు, చీర పిన్ను లభించాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడవేసి ఉండవచ్చని అనుమానంతో, త్రిపురారం జి పి ఓ  ఆవిరెండ్ల సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు  తెలిపారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-body-of-an-unidentified-woman-was-found/article-16186

Tags: