నూతన డీఈఓ ను సన్మానించిన డా. కోడి శ్రీనివాసులు
ట్రస్మా ఆధ్వర్యంలో ఘన సన్మానం
విశ్వంభర, నల్లగొండ :- నల్గొండ జిల్లా నూతన జిల్లా విద్యాశాఖాధికారిగా (డీఈవో) బాధ్యతలు స్వీకరించిన సుశీందర్ రావు ని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, జిల్లా విద్యాభివృద్ధికి డీఈవో సుశీందర్ రావు నాయకత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి విద్యారంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారంలో కూడా సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను రెండింటిని సమానంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడే ప్రైవేట్ పాఠశాల నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు కందాల పాపిరెడ్డి, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.వీ. రావు, జిల్లా కోశాధికారి మట్ట చెన్నయ్య గౌడ్, కార్పొరేటర్ గంట్ల అనంతరెడ్డి ట్రస్మా నాయకులు పుచ్చకాయల వెంకటరెడ్డి, నల్లగొండ టౌన్ ప్రెసిడెంట్ అజీజ్, శంభు లింగారెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకట్ రెడ్డి, కన్నయ్య, శ్రీనివాస్, కనయ్య, రామకృష్ణ, గొట్టిపర్తి చంద్రశేఖర్, మట్ట అంజన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జంగయ్య గౌడ్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొని నూతన డీఈవో గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడగా, జిల్లా విద్యాభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.