తెలంగాణ రాష్ట్ర సాధన ఫలితమే నేటి అభివృద్ధి
: టీపీ జేఏసీ నేతలు
విశ్వంభర, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నటరాజ్ చౌరస్తా వద్ద గల తెలంగాణ దీక్ష స్థల్‌లో టీపీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీ జేఏసీ జిల్లా చైర్మన్ వై. అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి, బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్, టీపీ జేఏసీ నాయకులు అనంతయ్య, మల్లయ్య, లక్ష్మయ్య, కుమ్మరి సాయిలు, బందన్న గౌడ్, టీపీ జేఏసీ కోఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర, టీజేఎస్ మహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సాయి వరాల, టీపీ జేఏసీ నాయకులు చంద్రారెడ్డి, శిరోమణి, అశోక్, మానస, న్యాయవాది నర్సింగ్ రావుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.