ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయం: దత్తాత్రేయ

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన లక్షలాది ప్రజల త్యాగాల ఫలితమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాదు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండారు విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యమ నేతలను సన్మానం చేసి ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఒక చరిత్రాత్మక పోరాటమని, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, కళాకారులు, మేధావులు కలిసి పోరాడిన సమిష్టి శక్తి వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైందని తెలిపారు. ఉద్యమకారుల అంకితభావం భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని, వారి సేవలను గుర్తించి సన్మానించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఉద్యమ అమరులకు నిజమైన నివాళి అని, ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఉద్యమ వీరుల త్యాగాలను ఎప్పటికీ మరువరాదని, సమగ్ర అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ సి హెచ్ విద్యాసాగర్ రావు, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండ రామ్, సీ హెచ్ విఠల్, ప్రొఫెసర్ పురపాటి వెంకట నారాయణ, బూర నర్సయ్య గౌడ్, పాశం యాదగిరి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dattatreya-remembers-the-sacrifices-of-the-activists/article-16198

Tags: