వైభవంగా శ్రీలక్ష్మీనారాయణుల  పరిణయం

వైభవంగా శ్రీలక్ష్మీనారాయణుల  పరిణయం

విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని కోమటిపల్లి లో స్వయంభు శ్రీ లక్ష్మీ నారాయణల కళ్యాణం దేవస్థానం కమిటీ రిషికేష్ బట్టర్ ఆధ్వర్యంలో అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య  వైభవోపీతంగా నిర్వహించారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన స్వామి వారి కళ్యాణాన్ని గ్రామస్తులతో పాటు,పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తిలకించి శ్రీమన్నారాయణ నామ స్మరణలో తరించి,పులకించి,పరవశించిపోయారు. భక్తులకు మహాన్న ప్రసాద వితరణ చేశారు. సాయం సమయంలో లక్ష్మీనారాయణ రథోత్సవం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.. గ్రామం గోవింద నామస్మరణలో మారుమ్రోగింది. కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. శ్రీ లక్ష్మీ నారాయణ పరిణయ మహోత్సవానికి బిఆరెస్ జిల్లా అధ్యక్షురాలు,మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్,స్థానిక సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ తదితర ప్రభుతులు హాజరయ్యారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో రిషికేశ్ బట్టర్,శ్రీరామ బట్టర్, కన్నయ్య, సంపత్ బట్టర్,వావిజ బట్టర్,ఆలయ కమిటీ చైర్మన్ శేరు శ్రీనివాస్,గడ్డం వెంకటేష్,నీలం యాకయ్య,కూరెల్లి సతీష్,రావుల మల్లేశం,యాకమూర్తి,చిర్రగొని రణధీర్,ఉదయ్ ధీర్, ఉమ్మగోని ఐలయ్య,రాంచంద్రు,మహేశ్వరా చారి,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/glorious-end-of-srilakshminarayana/article-15122

Tags: