ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిగా  తేలుకుంట్ల చంద్రశేఖర్

ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడిగా  తేలుకుంట్ల చంద్రశేఖర్

విశ్వంభర, చండూరు:  నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ   అధ్యక్షుడిగా చండూరు మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన న్యాయవాది, ప్రముఖ వ్యాపారవేత్త తేలుకుంట్ల చంద్ర శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునికి ఎన్నికకు చండూరు రెవెన్యూ పట్టణానికి చెందిన తేలుకుంట్ల చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారి ఇరుకుల్ల రామకృష్ణ ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్ర శేఖర్ పలువురు సన్మానించి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, పానగంటి మల్లయ్య, ఇరుకుల్ల రామకృష్ణ, మాజి జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, చండూరు, నాంపల్లి, మునుగోడు, గట్టుప్పల్, మర్రిగూడ మండలాల వైశ్య సభ్యులు తేలుకుంట్ల జానయ్య, సముద్రాల వెంకన్న, మంచుకొండ సంజయ్, కర్నాటి శ్రీనివాస్, సోమ నర్సింహా, గట్టు రాజశేఖర్, తాడిశెట్టి సంతోష్, సాగర్, తడకమల్ల శ్రీధర్, మిర్యాల శ్రీను, బిక్కుమాళ్ల విశ్వరాథం, ఆనంద్, నాగరాజు, సురేష్, భూపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags: