చండూరు కేంద్రంలో జిల్లా విద్యాధికారి సందర్శన
On
విశ్వంభర,చండూర్ :- జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి చండూరు కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాల , చండూరు హై స్కూల్, చండూరు, ప్రాథమిక పాఠశాలలో సందర్శించి తరగతులను పరిశీలించి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా గుణాత్మక విద్యను పెంపొందించాలని టి.ఎల్.ఎమ్ తో విషయ బోధన జరగాలని కేజీబీవీ పాఠశాలలో ఆహార పదార్థాల యొక్క నాణ్యతను పరిశీలించి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ వినూత్నమైన పద్ధతుల్లో విద్యార్థులకు ఎక్కువగా అర్థమయ్యే రీతిలో ఆధునిక పద్ధతిలో బోధించాలని తెలియజేయడం జరిగింది. మధ్యాహ్న భోజన పథక అమలుతీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డివో వెంట చండూరు ఎంఈఓ వి.సుధాకర్ రెడ్డి , హెచ్ ఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ కోటేశ్వర్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పిల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.



