కేజ్ వీల్స్‌తో ట్రాక్టర్లకు రోడ్లపై నో ఎంట్రీ

  1. నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాక్టర్ సీజ్.. రూ.10 వేల జరిమానా
    రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి: డీటీఓ శంకర్ నాయక్

విశ్వంభర, మహబూబాబాద్: రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని, కేజ్ వీల్స్  అమర్చుకుని ప్రజా రహదారులపై సంచరించే ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) శంకర్ నాయక్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజా ఆస్తులను పరిరక్షించాలని, రోడ్డు భద్రతకు సహకరించాలని ఆయన కోరారు.  వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించే ట్రాక్టర్లకు అమర్చే ఇనుప కేజ్ వీల్స్‌ను ప్రజా రహదారులపై వినియోగించరాదని డీటీఓ స్పష్టం చేశారు. బురద నేలల్లో ట్రాక్టర్‌కు మెరుగైన పట్టును కల్పించేందుకు మాత్రమే కేజ్ వీల్స్ ఉపయోగపడతాయని, వ్యవసాయ పనులు పూర్తయిన అనంతరం వాటిని తొలగించి సాధారణ రబ్బరు టైర్లను అమర్చుకుని మాత్రమే రహదారులపై ప్రయాణించాలని సూచించారు.  కేజ్ వీల్స్‌తో బీటీ, సీసీ, గ్రామీణ రహదారులపై ప్రయాణించడం వల్ల రోడ్ల ఉపరితలం తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపారు. దీంతో రహదారులపై గుంతలు ఏర్పడి, ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్లు త్వరగా ధ్వంసమవడంతో పాటు ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రైతులు ఇంటి నుంచి పొలానికి వెళ్లే సమయంలో కేజ్ వీల్స్‌ను ట్రాక్టర్ ట్రైలర్ (తొట్టి)లో తీసుకెళ్లి, పొలం వద్ద మాత్రమే వాటిని అమర్చుకోవాలని డీటీఓ సూచించారు. వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత కేజ్ వీల్స్‌ను తొలగించి రబ్బరు టైర్లను అమర్చుకున్న తర్వాతే రహదారులపై ప్రయాణించాలని సూచించారు. ప్రజా రహదారులను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రోడ్లు దెబ్బతినకుండా కాపాడటం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం తప్పించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని శంకర్ నాయక్ తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రైతులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/no-entry-on-roads-for-tractors-with-cage-wheels/article-18973

Tags: