ప్రజారోగ్యం, నగరాభివృద్ధిపై దృష్టి : కిషన్ రెడ్డి
విశ్వంభర, నాంపల్లి : ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించేలా 'ఫిట్ ఇండియా–హెల్త్ ఇండియా' లక్ష్యంతో ప్రతి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వర్షాకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాదు నాంపల్లి నియోజకవర్గ పరిధిలో మెహిదీపట్నం డివిజన్‌లోని అయోధ్య నగర్ బస్తీ, మల్లేపల్లి డివిజన్‌లోని సీతారాంబాగ్ బస్తీ, ఆసిఫ్ నగర్ డివిజన్‌లోని న్యూ ఇందిరానగర్ బస్తీల్లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా అయోధ్య నగర్ బస్తీలోని మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఆయన, అనంతరం సీతారాంబాగ్‌లోని రాంలీలా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మరో ఓపెన్ జిమ్‌ను ప్రజలకు అంకితం చేశారు. న్యూ ఇందిరానగర్‌లో బద్ది నల్ల పోచమ్మ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి, నల్ల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఆధునిక వ్యాయామశాల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ నగరంలో వర్షపు నీటి కాలువల పూడికతీత, చెట్ల పెంపకం, డ్రైనేజీ నిర్వహణ వంటి పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయం కావడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని గత, ప్రస్తుత ప్రభుత్వాలు చెప్పినా ఆశించిన స్థాయిలో పనులు కనిపించడం లేదని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి వర్షపు నీటి బొట్టును భూగర్భ జలాల పెంపునకు వినియోగించేలా వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ప్రతి ఇంటిలో, ప్రతి పార్కులో ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నగరంలో పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం అమలు చేయాలని, ప్రభుత్వాలు పక్షపాత ధోరణికి తావివ్వకుండా పారదర్శకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.