కార్వే కేఫ్‌ను ప్రారంభించిన కాలేరు వెంకటేష్
విశ్వంభర, అంబర్‌పేట : వ్యాపార రంగంలో కొత్తగా అడుగుపెడుతున్న యువ పారిశ్రామికవేత్తలు విజయవంతంగా ముందుకు సాగాలని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. హైదరాబాదు అంబర్‌పేట న్యూ నల్లకుంట, శివం రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్వే కేఫ్‌ను ఆదివారం స్థానిక నాయకులు గెల్వయ్య, ప్రదీప్ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఫ్‌ను పరిశీలించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉపాధి అవకాశాలు కల్పించే ఇటువంటి కొత్త వ్యాపార సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వినియోగదారుల విశ్వాసాన్ని పొందేలా నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ సేవలు అందించాలని సూచించారు. కేఫ్ యజమాని అబ్దుల్ గఫూర్కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్వే కేఫ్ విజయవంతంగా అభివృద్ధి చెంది మంచి గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో: కేఫ్ యజమాని అబ్దుల్ గఫూర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.