జిల్లా అధ్యక్షుడికి పట్టణ అధ్యక్షుడిని తొలగించే అధికారం లేదు...

  •  బత్తుల శంకర్ బాబు

విశ్వంభర,  హుస్నాబాద్: బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగిస్తున్నట్లు బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పేరుతో కొన్ని సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు తీవ్రంగా ఖండించారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, బైలా ప్రకారం పార్టీ నియమించిన పట్టణ అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడు స్వతంత్రంగా తొలగించే అధికారం లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం మేరకే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తాను దళిత వర్గానికి చెందిన నాయకుడినని, జిల్లా అధ్యక్షుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అందుకు అంగీకరించకపోవడంతో ఎలాంటి ఆధారాలు లేకుండానే పార్టీ ప్రయోజనాలు, క్రమశిక్షణ చర్యల పేరుతో తనను తొలగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడికి ఎవరినైనా నేరుగా పదవి నుంచి తొలగించే లేదా సస్పెండ్ చేసే అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై వ్యక్తిగత కక్షతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు ఫిర్యాదు చేయనున్నట్లు బత్తుల శంకర్ బాబు తెలిపారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-district-president-has-no-power-to-remove-the-town/article-18074

Tags: