పోచంపల్లి లో తెలంగాణ విమోచన దినోత్సవం.
అలుపెరుగని బాటసారికి జన్మదిన శుభాకాంక్షలు.
విశ్వంభర, భూదాన్ పోచంపల్లి :- పట్టణ కేంద్రంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ దేశంలో విలీనం చేసి డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ ప్రజల స్వతంత్రాన్ని తెచ్చుకున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ పోచంపల్లి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత జాతీయ జండా ఎగరవేశారు... అలాగే ఈరోజు మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 76 వసంతాలు పూర్తి చేసుకొని అలుపెరగని బాటసారిగా భారత దేశ ఆత్మ గౌరవాన్ని పెంచుతూ ప్రపంచం మొత్తం గర్వించేలా భారత దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు... ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పేద ప్రజలకి పండ్లు పంపిణీ చేశారు....ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు...



