నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

  • ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్

 విశ్వంభర, హుస్నాబాద్: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వి. వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రావాల్సిన డీఏలు, పీఆర్సీని ఇప్పటికీ ప్రకటించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, మూడు నెలలుగా ప్రీమియం కోత విధించినప్పటికీ వైద్య సేవలు అమల్లోకి రాకపోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, 317 జీవో బాధితుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో దశలవారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఉపాధ్యాయులు ఎల్. వీరారెడ్డి,రాజేందర్, మార్కండేయ, రాజమల్లు, శ్రీధర్, కె. రజిత, సుభాష్, రమేష్, వెంకటమల్లు, నర్సింహులు, శ్రీనివాస్, రాజమౌళి, బాలయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/teachers-protest-with-black-badges/article-21231

Tags: