పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: లక్ష్మయ్య
విశ్వంభర, ముషీరాబాద్ : పెన్షనర్ల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య హెచ్చరించారు. హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, 2024 పీఆర్సీని అమలు చేసి పెన్షన్ సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని, పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేయాలని, ఈహెచ్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అమలు చేస్తున్న సంక్షేమ ప్రయోజనాలను పెన్షనర్లకూ వర్తింపజేయాలని కోరారు. పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే ఆరోగ్య పథకం పేరుతో నిధులు మినహాయించడం అన్యాయమని విమర్శించారు. ఆగస్టు 15లోగా పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పెన్షనర్ల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ, గో చైర్మన్ రాజేంద్రబాబు, ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ఎం. కోదండరాం, నందిని సిద్ధారెడ్డి,, డి. సుధాకర్, శుభకర్, ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సుధాకర్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ సెక్రటరీ జనరల్ ఎం.వి. నర్సింగరావు,కృష్ణప్రసాద్, డాక్టర్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.