అండర్ డ్రైనేజ్ సిసి రోడ్ల పనులు ప్రారంభించిన సర్పంచ్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం నాగుల్దోని, డి జి తండా గ్రామపంచాయతీ పరిధిలో అండర్ డ్రైనేజ్ సిసి రోడ్లు పనులను సర్పంచ్ ఆంగోత్ అరుణ గోపాల్ నాయక్ శంకుస్థాపన చేసారు. హెచ్ ఎం డి ఏ,నిధులతో అండర్ డ్రైనేజీ పనులకు 9 లక్షలు , సిసి రోడ్లుకు ఏడు లక్షలతో గ్రామ పంచాయతీలో పనులు ప్రారంభించిన సర్పంచ్ అరుణ గోపాల్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామపంచాయతీలో అండర్ డ్రైనేజ్, సిసి రోడ్లే కాకుండా, గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తానని తెలియజేశారు. ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సర్పంచ్ అరుణ గోపాల్ నాయక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేఖ సురేష్, వార్డ్ మెంబర్స్ రాణి భాస్కర్, చందు, హరిలాల్, ప్రియాంక వెంకటేష్, సామ్లీ బాయ్ గోవింద్, సాయిరాం, అంజి నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.