సీనియర్ నేతలకు 60 శాతం నామినేటెడ్ పోస్టులు
- డి సీ సీ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి వెల్లడి
విశ్వంభర, హనుమకొండ: సుదీర్ఘకాలం పార్టీని నమ్ముకున్న నాయకులకు 60 శాతం నామినేటెడ్ పదవులు అధిష్ఠానం నిర్ణయంపై హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన మాజీ మండల అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, అనుబంధ సంఘాల నాయకులకు, నియోజకవర్గ సీనియర్ నాయకులకు రాబోయే నామినేటెడ్ పోస్టులలో, ముఖ్యంగా ప్యాక్స్ డైరెక్టర్లు, చైర్మన్లు, మార్కెట్ కమిటీ పదవులలో 60 శాతం కోటా కేటాయించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మకమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ జెండా మోసి సేవలు అందించిన నిజమైన కార్యకర్తలకు, నాయకులకు ఈ నిర్ణయం ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించడం పార్టీ సామాజిక సమతుల్యతకు నిదర్శనమన్నారు. ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు,నియోజకవర్గాల అభ్యర్థులందరూ సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ ఆశావహుల తుది నివేదికను రూపొందించేలా స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేయడం అభినందనీయమన్నారు. క్షేత్రస్థాయి శ్రేణుల త్యాగాలను గుర్తించి ఈ గొప్ప చొరవ చూపిన ఏఐసీసీ ప్రతినిధి మీనాక్షీ నటరాజన్ కి, గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపిందని, భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు .