చేనేతే మన సంస్కృతికి ప్రతీక: బండారు దత్తాత్రేయ

విశ్వంభర, రాంనగర్ : చేనేతే భారతీయ సంస్కృతికి ప్రతీక అని, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ లో అలాయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కార్మికులు, చేనేత రంగానికి విశిష్ట సేవలందించిన పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ చేనేత కార్మికులే భారతీయ సంప్రదాయాలకు నిజమైన వారసులని కొనియాడారు. చేనేత కుటుంబాల జీవనోపాధి మెరుగుపడేలా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. తెలుగు చేనేతకు ప్రపంచస్థాయిలో గుర్తింపు రావడానికి కార్మికుల నైపుణ్యం, అంకితభావమే కారణమని పేర్కొన్నారు. అలాయ్ బలాయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి మాట్లాడుతూ చేనేత రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించి కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, చేనేత రంగ ప్రముఖులు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bandaru-dattatreya-is-the-symbol-of-our-culture/article-21233

Tags: