త్రిబుల్‌ఐటీ బాసరలో సీట్లు సాధించిన కల్వల విద్యార్థులకు సన్మానం
విశ్వంభర,కేసముద్రం: జెడ్పీహెచ్‌ఎస్ కల్వల విద్యార్థులు త్రిబుల్‌ఐటీ బాసరలో సీట్లు సాధించడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి అన్నారు. “నేడు సాధించిన విజయం... రేపటి గొప్ప భవిష్యత్తుకు నాంది” అని పేర్కొన్నారు. మండ సహస్ర, బానోత్ నవ్య, బాదావత్ అనూషలు త్రిబుల్‌ఐటీ బాసరలో సీట్లు సాధించగా, తెలుగు మీడియంలో అత్యధిక మార్కులు సాధించిన భానోత్ సింధు, బోడ శిరీషలను అభినందించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు జిలకర ఏకాంతం విద్యార్థులకు తలా రూ.1,000 నగదు బహుమతితో పాటు శాలువాలు, మెమొంటోలు అందించి ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గంటా సంజీవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల విజయం వారి కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శకత్వానికి నిదర్శనమన్నారు. ఈ విజయాలు భావితర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సుజాత రామచందర్, ఉపసర్పంచ్ పెద్దగాని రవి, వార్డు సభ్యుడు గంటా బాలకృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు చింతనూరి వీరయ్య, పెరుమాండ్ల ఎల్లగౌడ్, ఉపాధ్యాయులు ఆర్.ఏకాంబరం, బి.సత్యనారాయణ, తండ సదానందం, వేముల నాగేందర్, మహంకాళి ఏకాంబరం, రాగి బిక్షపతి, వి.రాజేంద్రచారి, కొప్పుల శంకర్, కే.పార్వతి, ఎం.డి.జుబేర్ అలీ, ఓడపల్లి రాము, కే.రాములు, జి.నాగరాజు, ఆవుల లింగయ్య, ఎస్.సునీల్, ఎస్.రాధాదేవి, గనే లక్ష్మి తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.