తుమ్మలూరు గ్రామ కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు.. డీఎల్‌పీఓ విచారణ
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి అలివేలుపై గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు చేసిన అవినీతి, అక్రమాల ఆరోపణలపై జిల్లా స్థానిక సంస్థల పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) సాంబిరెడ్డి శుక్రవారం విచారణ నిర్వహించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు, వైకుంఠధామం బోర్డు తొలగింపు, అధికారిక వ్యవహారాల్లో కార్యదర్శి భర్త జోక్యం తదితర అంశాలపై ఫిర్యాదులను పరిశీలించారు. విచారణ అనంతరం పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని డీఎల్‌పీఓ తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని గ్రామ కార్యదర్శి అలివేలు పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు జారీ చేసి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే విధులు నిర్వహించానని చెప్పారు. ఎంపీఓ రవీందర్ కూడా అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కార్యదర్శికి సూచించినట్లు తెలిపారు.