తైక్వాండోలో గిన్నిస్ రికార్డు ప్రయత్నం నేడు
విశ్వంభర, హిమాయత్‌నగర్ : తైక్వాండోలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించే లక్ష్యంతో ఆగస్టు 9న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ‘లార్జెస్ట్ తైక్వాండో లెసన్’ నిర్వహించనున్నట్లు గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉదయం 7 నుంచి 10 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా తైక్వాండో క్రీడాకారులు పాల్గొని జంపింగ్ కిక్స్, పంచెస్, బ్లాక్స్ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సాధించేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. 9 నుంచి 70 ఏళ్ల వయస్సు గల తైక్వాండో క్రీడాకారులు, విద్యార్థులు, కోచ్‌లు పాల్గొనవచ్చని, అధికారిక డోబోక్ దుస్తుల్లో హాజరుకావాలని సూచించారు. తైక్వాండోకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాస్టర్ గజేందర్ కుమార్, శ్రీకాంత్, సమన్వయకర్త సుమన్ తదితరులు పాల్గొన్నారు.