ఆకట్టుకున్న అమృత అరంగేట్రం
విశ్వంభర, రవీంద్రభారతి : వర్ణ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో నిర్వహించిన కుమారి అమృత ముత్యాల భరతనాట్య అరంగేట్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ యూనివర్సిటీ డాన్స్ విభాగాధిపతి అరుణ భిక్షు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అమృత భరతనాట్యంలో చూపిన ప్రతిభ అభినందనీయమని, గురు డాక్టర్ స్మితా మాధవ్ భారతీయ శాస్త్రీయ కళల పరిరక్షణకు విశేష కృషి చేస్తున్నారని ఆమె కొనియాడారు. డాక్టర్ స్మితా మాధవ్ శిష్యురాలైన అమృత 2018లో కూచిపూడితో శాస్త్రీయ నృత్య ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం భరతనాట్యంలో శిక్షణ పొందింది. ప్రస్తుతం పేజ్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం చదువుతోంది. ఈ సందర్భంగా అమృత మాట్లాడుతూ, భరతనాట్య అరంగేట్రం తన జీవితంలో చిరస్మరణీయ ఘట్టమని పేర్కొంది. జగన్నాథ అష్టకం, సుందర నటరాజం, మాటే మలయధ్వజ, తిల్లానా, మంగళం ప్రదర్శనలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. నట్టువాంగం: డాక్టర్ స్మితా మాధవ్. వయోలిన్: ఎం.ఎస్. కన్నన్. మృదంగం: కార్తికేయన్. వేణువు: శృతి సాగర్. వీణ: భవానీ ప్రసాద్ సంగీత సహకారం అందించారు.