సూర్యాపేట జాతీయ రహదారిపై ప్రమాద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు 

 విశ్వంభర, సూర్యాపేట: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి వెంట వాహనదారులకు అవగాహన కల్పించేలా, ప్రమాదాల తీవ్రతను వివరిస్తూ పలు ప్రాంతాల్లో ఈరోజు హెచ్చరిక మరియు సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, వాహనదారులలో చైతన్యం తెచ్చేందుకే జాతీయ రహదారిపై ఈ సైన్ బోర్డులను అమర్చాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం మరియు తీవ్ర ప్రమాదకరం. తల్లిదండ్రులు ఈ విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలి. ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, పెద్ద వాహనాల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మద్యం మత్తులో వాహనాలు తొలవద్దు, తక్కువ వేగంతో వాహనాలు నడపాలి, రోడ్డుపై ఉన్న పరిస్థితులను అంచనా వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని, పోలీసు శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ కోరారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/installation-of-danger-warning-boards-on-suryapet-national-highway/article-21195

Tags: