శ్రీ కట్ట మైసమ్మ బోనాల జాతరకు ఘనంగా ఏర్పాట్లు
విశ్వంభర, ముషీరాబాద్ : హైదరాబాదులోని లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో ఆషాఢ బోనాల జాతరను ఆగస్టు 9, 10 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతర ఆహ్వాన పత్రికను ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ సభ్యుడు గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్, కార్యనిర్వహణాధికారి పి. మహేందర్ గౌడ్, ప్రధాన అర్చకులు సాత్విక్ శర్మ ఆవిష్కరించి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దివ్య దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. పంచామృతాభిషేకం, ప్రత్యేక పుష్పాలంకరణ, బాలభోగం, విశేష పూజలు, బోనాల సమర్పణ, బలిహరణ, బంధనం వంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం ఘటోత్సవం ఆలయం నుంచి పింగళి వెంకటరామిరెడ్డి ఫంక్షన్ హాల్ వరకు ఊరేగింపుగా వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. అనంతరం మహానివేదనం, సాయంత్రం రంగం, గావు కళ్యాణం, పోతురాజుల విన్యాసాలు, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్ తెలిపారు. తాగునీరు, ప్రసాదం, వైద్య శిబిరం, తాత్కాలిక మరుగుదొడ్లు, క్యూలైన్లు, బ్యారికేడ్లు, విద్యుత్ వెలుగులు, పారిశుద్ధ్య ఏర్పాట్లతో పాటు మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని కార్యనిర్వహణాధికారి పి. మహేందర్ గౌడ్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక మళ్లింపులు అమలు చేయనున్నారని, శాంతిభద్రతల కోసం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పోలీసు అధికారులు, ఆలయ వాలంటీర్ల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన అర్చకులు సాత్విక్ శర్మ మాట్లాడుతూ, రెండు రోజుల పాటు జరిగే బోనాల మహోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్, రాజేష్ శర్మ, రాంబాబు శర్మ, లక్ష్మీనరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.