మృతుడి కుటుంబానికి ఆపన్న హస్తం

మృతుడి కుటుంబానికి ఆపన్న హస్తం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కాటం నరసింహ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. తన వంతు సహాయంగా బిఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టి.యు.ఎఫ్ మైనార్టీ సెల్ కన్వీనర్, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ వారి కుటుంబాన్ని పరామర్శించి  ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం 50 కిలోల బియ్యం, రూ 2,500 రూపాయలు నగదు అందజేశారు.  ప్రభుత్వం కాటం నరసింహ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, మల్లం సైదులు, కాటం రమేష్, కాటం నిర్మల, వారి కూతురు మమత తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-hand-to-the-family-of-the-deceased/article-21177

Tags: