రైస్ మిల్లింగ్ రంగాన్ని కాపాడాలి : సయ్యద్ రఫీ
విశ్వంభర, హిమాయత్ నగర్ : రాష్ట్రంలో రైస్ మిల్లింగ్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో, విజిలెన్స్ దాడులు ,పోలీసు ఒత్తిడిని తక్షణమే నిలిపివేసి, పరిశ్రమను రక్షించేందుకు సమగ్ర విధాన నిర్ణయం తీసుకోవాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ రఫీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైస్ మిల్లర్లను అనుమానితులుగా చూడకుండా వ్యవసాయ సరఫరా వ్యవస్థలో కీలక భాగస్వాములుగా గుర్తించాలని సూచించారు. దశాబ్దాలుగా అమలులో ఉన్న 67 శాతం బియ్యం రికవరీ ప్రమాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేవని పేర్కొంటూ, రబీ, ఖరీఫ్ సీజన్ల వారీగా ప్రతి జిల్లాలో టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి వాస్తవ రికవరీ ఆధారంగా బియ్యం స్వీకరణ విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోపు ప్రభుత్వం మిల్లర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, అవసరమైతే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి మాట్లాడుతూ, పాత నిబంధనలు మరియు విధానపరమైన లోపాల కారణంగా రైస్ మిల్లింగ్ రంగం తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది మిల్లర్లు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొందరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ధాన్యం నాణ్యత, తేమ శాతం, నిల్వ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే రకమైన రికవరీ ప్రమాణాలు అమలు చేయడం వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని ఆయన అన్నారు. మిల్లింగ్ పూర్తయిన వెంటనే బియ్యం స్వీకరించే విధానాన్ని అమలు చేయాలని, షార్ట్‌ఫాల్ పేరుతో కేసులు నమోదు చేయడం, భారీ జరిమానాలు విధించడం, అరెస్టులు చేయడం వంటి చర్యలను నిలిపివేయాలని కోరారు. అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు మిల్లింగ్, హ్యాండ్లింగ్, కస్టోడియన్, డ్రైయేజ్ తదితర పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లింగ్ రంగాన్ని రక్షించడం అంటే రైతుల ప్రయోజనాలు, వ్యవసాయ వ్యవస్థ మరియు రాష్ట్ర ఆహార భద్రతను కాపాడటమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ దేశాయి, ఉపాధ్యక్షులు ధనలక్ష్మి, నాగరాజు, బుచ్చి రాములు, సత్యనారాయణ, చొక్కా రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.