జనగణన  వివరాల సేకరణ గడువులోగా పూర్తి చేయాలి: భారతి హోళికేరి

విశ్వంభర, మహబూబాబాద్: జనగణన–2027లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీకి అవసరమైన గ్రామ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళికేరి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, బ్యాంకింగ్, వ్యవసాయం తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. నమోదు చేసే ప్రతి సమాచారం ఖచ్చితంగా, సంపూర్ణంగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా సమాచార సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ, జనగణన హ్యాండ్‌బుక్ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ప్రామాణిక సమాచార గ్రంథంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు వెబ్ పోర్టల్‌లో సమాచార నమోదు పూర్తిచేసి, సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ మధుసూదన రాజు, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/collection-of-census-details-should-be-completed-by-bharati-holikeri/article-21169

Tags: