అంగన్వాడీ కేంద్రాలలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
విశ్వంభర, రామన్నపేట: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్న పేట మండలం, సిరిపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో అన్నప్రాసన కార్యక్రమాన్ని సి.బి.ఈ ఈవెంట్ గా నిర్వహించారు. తల్లి పాలు, తల్లి పాలతో పాటు అనుబంధ ఆహారం, 2 సంవత్సరాల వరకు బిడ్డకు తల్లి పాలు కొనసాగించాలని, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు పట్టించాలని, అవే బిడ్డకు వ్యాధి నిరోధక టీకా లాగా పని చేస్తుందని, బిడ్డకు 6 నెలల వరకు కేవలం తల్లి పాలు పట్టించాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉప-సర్పంచ్ మూడుదూడ్ల అనూష రమేష్, పంచాయితీ సెక్రటరీ ఎం.జ్యోతి, వార్డు సభ్యులు జెల్ల సూర్యకళా శ్రీనాథం, పగుడాల లక్ష్మి, ఏ.ఎన్.ఎం శ్యామల, అంగన్వాడీ టీచర్స్ వసంత, జ్యోతి, సునీత, నవనీత, ఆశాలు, మహిళా సంఘ సభ్యులు, ఆరోగ్య లక్ష్మి కమిటీ సభ్యులు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొనడం జరిగింది.