పీఎం శ్రీ మోడల్ స్కూల్ ను సందర్శించిన స్పెషలాఫీసర్
విశ్వంభర, నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురు లోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, హాస్టల్ ను స్పెషల్ ఆఫీసర్ సాయి శ్రీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల,హాస్టల్‌లోని పలు అంశాలను పరిశీలించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజనం నాణ్యత, రుచి,నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నందుకు వంట సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.హాస్టల్ నిర్వహణకు సంబంధించి కేర్‌టేకర్ అనితతో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు.విద్యార్థులతో ముచ్చటించి వారి చదువు, హాస్టల్ వసతులు, సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.