రామన్నపేటలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నకరికంటి మొగులయ్య, మండల ఇన్‌చార్జి కొరివి శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడంలో విఫలమైందని విమర్శించారు. సమావేశంలో రామన్నపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని, ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, ధర్మారెడ్డిపల్లి–పిలాయిపల్లి కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, మండలంలోని పెండింగ్ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు పూర్తి చేయాలని తీర్మానించారు. అలాగే సుభాష్ సెంటర్–నీర్నెముల రోడ్డును విస్తరించి, గ్రామీణ రహదారులను మరమ్మతు చేసి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.