కాంగ్రెస్ ఇనుగుర్తి మండల అధ్యక్షుడిగా అశోక్ గౌడ్

విశ్వంభర, ఇనుగుర్తి: కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల అధ్యక్షుడిగా బైరు అశోక్ గౌడ్‌ను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ శుక్రవారం ప్రకటించారు. పార్టీ కష్టకాలంలోనూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన అశోక్ గౌడ్ గతంలో నెల్లికుదురు ఉమ్మడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడుసార్లు, జిల్లా ప్రచార కోఆర్డినేటర్‌గా, ప్రస్తుతం డీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ క్రమశిక్షణతో మండలంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ashok-goud-as-the-president-of-congress-inugurthi-mandal/article-21235

Tags: