గిర్ని తండా అంగన్వాడి స్కూల్లో తల్లిపాల వారోత్సవాలు

విశ్వంభర, కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలోని గిర్ని తండా  పరిధి అంగన్వాడి సెంటర్ లో  ఆరు అంగన్వాడి సెంటర్లు కలిసి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు  ఘనంగా నిర్వహించాయి . ఈ సందర్భంగా 15 వ వార్డు కౌన్సిలర్ విజయభద్రు తల్లులకు, బాలింతలకు, గర్భిణులకు అవగాహన కల్పిస్తూ తల్లిపాలే పిల్లలకు శ్రీరామరక్షని, ముర్రుపాలు విశిష్టత, 1000 రోజుల ప్రాముఖ్యతపై వివరించారు. డబ్బా పాలు వద్దు అమ్మపాలె ముద్దని చెప్పారు. పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం అని గర్భిణీలకు,బాలింతలకు,తల్లులకు సూచించారు.తల్లిపాలే శిశువుకు తొలి టీకా,సంపూర్ణ ఆరోగ్యానికి తొలి అడుగని చెప్పారు పుట్టిన గంటలోపే తల్లిపాలైన ముర్రుపాలు పట్టించడం తప్పనిసరని,మొదటి 6 నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని,తల్లిపాలలో ఉన్న పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుండి శిశువును రక్షిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో , అంగన్వాడీ టీచర్లు రమాదేవి, కవిత, జ్యోతి లలిత పుష్పలీల రాజమణి లలిత, ప్రధానోపాధ్యాయులు జనార్ధన్, తల్లులు గర్భిణులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/breastfeeding-week-celebrations-at-girni-tanda-anganwadi-school/article-21143

Tags: