సూర్యాపేట పట్టణ అభివృద్ధే ధ్యేయం.. వెనుకబడిన వార్డులపై దృష్టి

: ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి 

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ అభివృద్ధే ధ్యేయం గా పనిచేస్తామని, వెనుకబడిన వార్డులపై దృష్టి పెట్టి సమన్వయంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. జిల్లా కేంద్రంలోని 25 వ వార్డు కౌన్సిలర్ కోడి శిరీష శివ వార్డులోని ముత్యాలమ్మ గుడి సమీపంలో మున్సిపల్ జనరల్ ఫండ్ నిధుల ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్ కల్వర్టుల నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ తో కలిసి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈనెల 15 లోపు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు  మంజూరు అవుతాయని తెలిపారు. సమగ్ర నివేదిక ప్రకారం  రాష్ట్రవ్యాప్తంగా దారిద్య రేఖ దిగువన ఉన్న  పేదలకు ఒక కోటి 5 లక్షల రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న, మున్సిపల్ కౌన్సిలర్లు నాగుల వాసు, గుణగంటి హేమ సతీష్, కొణతం రాజేష్ రెడ్డి, పాలగాని మాధవి కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, ధరావత్ వీరన్న నాయక్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, జిల్లా కాంగ్రెస్ సేవదల్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, మాజీ కౌన్సిలర్ వల్దాసు దేవేందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్, నరేందర్ నాయుడు, పడిదల రవి, యాట వెంకన్న, ఖమ్మంపాటి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/urban-development-of-suryapet-focuses-on-backward-wards/article-21157

Tags: